// నా కూతురు //
Example :
నాకు ఒక కూతురు పుట్టిందనుకోండి.
మొదట నా ధైర్యం నా కూతురికి నూరిపోయడమే.
ఎవడో ఒక వెధవ కామెంట్ చేసాడు అనుకోండి, తను వచ్చి కన్నీరు పెట్టుకొని ఏడ్చే పరిస్థితి నా కుతురి అలవాటు చేయను..దైర్యంగా వాడి తల తీసుకొని రా నేను చూసుకుంటా అని చెప్తా అంతే..
ప్రతి ఆడపిల్ల ఉన్న తల్లి చెప్పాల్సింది కృష్ణుని లీలలు,రాముడు,సీత గురించి కాదు ..
సమాజం యొక్క స్వభావం, ఇంత పెద్ద ప్రపంచం లో తన కూతురు యొక్క భాగస్వామ్యం,తన హక్కులగురించి,తన విధుల గురించి,తను ఎదుటివారిని బట్టి ప్రవర్తించే తీరును,గౌరవ మర్యాదల గురించి,తను కలలు కంటున్నా జీవితం గురించి ప్రతి విషయం లో తన స్వేచ్ఛ గురించి తెలియ చేయాలి.
ఒక వయస్సు తరువాత ఏ ఆడపిల్లను ఇంట్లో ఉంచుకోలేం అది మానవ సహజ జీవన ప్రకీయ మాత్రమే..
తలవంచి తాళి కట్టించున్నావ్.నీ భర్త తలెత్తుకునేట్టు నీ ప్రవర్తన ఉండాలి అని చెప్తాము అంత వరకు సమంజసమే..
భర్త కొట్టినా చిత్రహింసలు పెట్టినా భరించు కాని పుట్టింటికి చెడ్డపేరు తీసుకురావొద్దు. బతికితే భర్త దగ్గరే బతుకు,చస్తే భర్త దగ్గరే చావు అనే అధైర్యాని మాత్రం ఇవ్వకండి..మేమున్నాం అని భరోసా ఇవ్వండి..
ఎంతో కష్టపడి చదివిస్తాం ..ఎందుకు..? పుట్టిన 3 సంవత్సరాలకే స్కూల్ లో వేస్తాం తన ..భర్త బేవార్స్ ఐనా తన కాళ్ళ మీద తను బతుకుతుందనేగా..
పుట్టక ముందే పురిట్లో చంపేసే వాళ్ళ గురించి నేను అసలు మాట్లాడదలుచుకోలేదు ..జంతువు కూడా జన్మనిస్తుంది కడుపులో చంపేయదు. ఇలాంటి వాళ్ళను జంతువులతో పోల్చటం వాటికి అవమానం..
ప్రతి ఇంట్లో అమ్మాయికి ప్రతివిషయం లో స్వేచ్ఛ స్వాతంత్రం ఇవ్వండి .
శ్లోకాలు,పురాణాలు,భక్తి అనే అజ్ఞానాన్ని మాత్రం ఉగ్గు దినుసులో నూరి మాత్రం పోయకండి..
Humble Request🙏🙏🙏🙏🙏
ఒక తమ్ముడిగా,ఒక అన్నగా, ఆడపిల్ల వంటింట్లో ఇంట్లో ఉండాలి, కార్ షేడ్లో ఉండాలి అనే మాటలు మాగాడి నుండి వచ్చినప్పుడు వాడు మనిషిగా చనిపోయినట్లే..
0 comments:
Post a Comment