ప్రార్ధన
ఊపిరి నిలిపేంత గాలిని మాత్రం ప్రసాదించు
కానీ, ఉనికిని ఛేదించే సుడిగాలి నుండి రక్షించు
దప్పిక తీర్చేంత నీటిని మాత్రం ప్రసాదించు
కానీ, మనుగడను హతమార్చే జల ప్రలయం నుండి రక్షించు
అవసరాలను ఆదుకునే ఆదాయాన్ని మాత్రం ప్రసాదించు
కానీ, మనసును చంపే సిరిసంపదల నుండి రక్షించు